గజ్వేల్‌లో ఈటల పోటీ చేస్తే మద్దతిస్తాం: భారాస అసంతృప్త నాయకుల నిర్ణయం

‘అభివృద్ధి చేశామని చెబుతున్నారు... ఎక్కడ సీఎం ఉన్నా అక్కడ అభివృద్ధి జరగటం సర్వసాధారణం... మాకు ఆత్మాభిమానం ముఖ్యం... అది లేని చోట మేము ఉండలేం’ అంటూ గజ్వేల్‌ నియోజకవర్గ భారాస అసంతృప్త నాయకులు అన్నారు.

Updated : 19 Oct 2023 06:56 IST

గజ్వేల్‌, న్యూస్‌టుడే: ‘అభివృద్ధి చేశామని చెబుతున్నారు... ఎక్కడ సీఎం ఉన్నా అక్కడ అభివృద్ధి జరగటం సర్వసాధారణం... మాకు ఆత్మాభిమానం ముఖ్యం... అది లేని చోట మేము ఉండలేం’ అంటూ గజ్వేల్‌ నియోజకవర్గ భారాస అసంతృప్త నాయకులు అన్నారు. గజ్వేల్‌ నుంచి భాజపా నేత ఈటల రాజేందర్‌ పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని టీవైఆర్‌ గార్డెన్‌లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియా మాజీ ఛైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌, గజ్వేల్‌ ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ టేకులపల్లి రాంరెడ్డి, ములుగు జడ్పీటీసీ మాజీ సభ్యుడు సింగం సత్తయ్య, గజ్వేల్‌ మాజీ ఎంపీపీ రాజు, నాయకులు సురేశ్‌ గౌడ్‌, వివిధ మండలాలలోని పలువురు సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తే ఎంతో సంతోషించామని.. ఆయన సీఎం అయ్యాక ఇక్కడ నాయకులకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. అందుబాటులో లేకపోవటం, ఉద్యమకారులను విస్మరించటంతో మనస్తాపానికి గురయ్యామన్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా గుర్తింపు లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని