నకిలీ లేఖతో చంద్రబాబుపై దుష్ప్రచారం.. సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో తెదేపా ఫిర్యాదు

తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేరిట నకిలీ లేఖను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొ.తిరునగరి జ్యోత్స్న గురువారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ సైబర్‌ డీసీపీ ధార కవితకు ఫిర్యాదు చేశారు.

Updated : 10 Nov 2023 07:01 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేరిట నకిలీ లేఖను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొ.తిరునగరి జ్యోత్స్న గురువారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ సైబర్‌ డీసీపీ ధార కవితకు ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘తెదేపా జాతీయ కార్యాలయం(ఎన్టీఆర్‌ భవన్‌, ఆత్మకూరు గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌) లెటర్‌ హెడ్‌తో చంద్రబాబు విడుదల చేసినట్లుగా ఒక నకిలీ లేఖను సృష్టించారు. దానిని వైకాపా సోషల్‌ మీడియా, వైఎస్‌ఆర్‌సీపీ ఆంధ్రప్రదేశ్‌, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ వైఎస్‌ఆర్‌ గ్రామ సచివాలయం, జగన్‌ కల్ట్‌ ఫ్యాన్స్‌, కేతిరెడ్డి యువసేన తాడిమర్రి వంటి ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా వైరల్‌ చేస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతోపాటు ఏ పార్టీకీ మద్దతు ఇవ్వవద్దని తెదేపా నిర్ణయించింది. కానీ నకిలీ లేఖతో మా విధానానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని జ్యోత్స్న కోరారు. ఆమె వెంట పార్టీ ప్రధాన కార్యదర్శులు షేక్‌ ఆరిఫ్‌, జీవీజీ నాయుడు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని