మంత్రాలయంలో వైకాపాకు ఎదురుదెబ్బ

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (కేడీసీసీబి) మాజీ అధ్యక్షుడు రామిరెడ్డి తనయులు వైకాపాకు రాజీనామా చేశారు.

Published : 28 Nov 2023 03:36 IST

ఆ పార్టీని వీడిన కేడీసీసీ బ్యాంక్‌ మాజీ అధ్యక్షుడి తనయులు

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (కేడీసీసీబి) మాజీ అధ్యక్షుడు రామిరెడ్డి తనయులు వైకాపాకు రాజీనామా చేశారు. త్వరలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పార్టీలో చేరేందుకు తెదేపా అధిష్ఠానం అనుమతి ఇచ్చిందని రామిరెడ్డి తనయులు మాధవరం రాఘవేంద్రరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, రామకృష్టారెడ్డి తెలిపారు. మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైకాపా చేస్తున్న అరాచకాలు చూడలేక వైకాపాకు రాజీనామా చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు పరాజయం తప్పదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు