అయిదు రాష్ట్రాల్లో.. 18% అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు

తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 18% మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల్లో కోటీశ్వరుల వాటా 29%. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.

Updated : 29 Nov 2023 06:37 IST

29% మంది కోటీశ్వరులు
ఏడీఆర్‌ నివేదికలో వెల్లడి

దిల్లీ: తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 18% మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల్లో కోటీశ్వరుల వాటా 29%. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం ఎన్నికల్లో కలిపి మొత్తంగా 8,054 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 8,051 మంది ప్రమాణపత్రాలను ఏడీఆర్‌ పరిశీలించింది. అందులో గుర్తించిన వివరాల ప్రకారం- పోటీ చేస్తున్నవారిలో జాతీయ పార్టీల అభ్యర్థులు 2,117 మంది ఉన్నారు. రాష్ట్ర పార్టీల అభ్యర్థులు 537 మంది. రిజిస్టరైన గుర్తింపుపొందని పార్టీలవారు 2,051 మంది. 3,346 మంది స్వతంత్రులుగా బరిలో ఉన్నారు.

  • క్రిమినల్‌ కేసులున్న అభ్యర్థులు - 1,452
  • తీవ్ర నేరాల సంబంధిత కేసులున్నవారు - 959
  • హత్య కేసులు నమోదైనవారు - 22
  • హత్యాయత్నం కేసులున్నవారు - 82
  • మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదైనవారు - 107
  • మొత్తం అభ్యర్థుల్లో కోటీశ్వరులు - 2,371 మంది
  • వారి సగటు ఆస్తి - రూ.3.36 కోట్లు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని