క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు

‘ఎన్నికలకు మహా అయితే 140 రోజుల గడువుంది.. ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుంది.

Updated : 29 Nov 2023 07:37 IST

కాకినాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: ‘ఎన్నికలకు మహా అయితే 140 రోజుల గడువుంది... ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుంది.  తప్పకుండా ఒక క్రైస్తవుడు.. అదే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలనేది నా కోరిక..’ అని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల కాకినాడలోని మెక్లారిన్‌ మైదానంలో నిర్వహించిన ప్రీక్రిస్మస్‌ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘జగన్‌ సీఎంగా ఉంటే మనం ఎంత బలంగా ఉండొచ్చో పాస్టర్లందరికీ తెలుసు. మనం స్వేచ్ఛగా ఉండాలన్నా, ప్రార్థనలు చేసుకోవాలన్నా సీఎంగా జగన్‌ ఉండాలి. రాబోయే రోజుల్లో క్రైస్తవవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. నేను, కన్నబాబు ఎమ్మెల్యేలుగా.. జగన్‌ సీఎంగా ఉన్నామంటే కచ్చితంగా మీ ఆశీర్వాదాలు, ప్రార్థనలు, దేవుడి బలమే కారణం’ అని ద్వారంపూడి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని