ఓబీసీ జాబితాలో తూర్పుకాపులను చేర్చడానికి ఎన్‌సీబీసీ సిఫార్సు: ఎంపీ జీవీఎల్‌

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోండి కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడానికి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ (ఎన్‌సీబీసీ) మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.

Published : 29 Nov 2023 05:48 IST

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోండి కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడానికి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ (ఎన్‌సీబీసీ) మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. ఈ మేరకు ఆ కమిషన్‌ ఛైర్మన్‌ హన్సరాజ్‌ జి.అహిర్‌ను కలిసి ధన్యవాదాలు తెలియజేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 40 లక్షల మందికిపైగా ఉన్న ఈ కులాల వారు తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఏళ్ల తరబడి చేస్తున్న డిమాండ్‌ను కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్రకుమార్‌, ఎన్‌సీబీసీ ఛైర్మన్‌ వద్దకు తాను పలుమార్లు తీసుకెళ్లినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని