అధికారంలోకి రాగానే ఖాళీలన్నీ భర్తీ: నాగబాబు

తెదేపా-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పేర్కొన్నారు.

Published : 29 Nov 2023 05:49 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంలో యువత భవిష్యత్తు నాశనమైందని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీ ద్వారా ఏటా ఖాళీలు భర్తీ చేస్తామని, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. ‘ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు 22 లక్షల మంది.. ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోయారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలున్నా వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదు. జాకీ, ఏపీపీ పేపర్‌ మిల్లు, లులు మాల్‌తో పాటు తిరుపతికి రావాల్సిన భారీ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ సహా అనేక కంపెనీలు.. వైకాపా ప్రభుత్వ విధానాలతో విసిగి పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని