లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరిన మండలాధ్యక్షులు

నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ విధానాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వైకాపాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు.

Published : 29 Nov 2023 05:49 IST

అమలాపురం పట్టణం, ఏలేశ్వరం, న్యూస్‌టుడే: నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ విధానాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వైకాపాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. అమలాపురం పేరూరు విడిది కేంద్రంలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో మంగళవారం ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన పలువురు వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. ఏలేశ్వరం, రౌతులపూడి మండలాధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి, గంటిమళ్ల రాజ్యలక్ష్మి, భద్రవరం ఎంపీటీసీ సభ్యుడు కొప్పుల బాబ్జి, తూర్పులక్ష్మిపురం సర్పంచి వీరంశెట్టి సత్యభార్గవితోపాటు పలువురు వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. వారికి తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి లోకేశ్‌ సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త పరువుల సత్యప్రభరాజా, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు