మట్కా, బెట్టింగ్‌ ఆడేవారిని ఉరేస్తారా?

మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడేవారిపై.. వాటి నిర్వాహకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు.

Published : 29 Nov 2023 05:52 IST

ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వ్యాఖ్య

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడేవారిపై.. వాటి నిర్వాహకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. ‘వారిని ఉరేస్తారా? చట్టం తనపని తాను చేసుకుపోతుంది. అవసరమైతే పోలీసులు పీడీ యాక్టు పెడతారు..’ అని తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. సర్వేనంబరు 352లోని నాలుగెకరాలకు సంబంధించి 400 మంది బాధితులున్నారని, అందరికీ న్యాయం చేశామని అన్నారు. ఎవరైనా భూబాధితులు ఇంకా ఉంటే తమ వద్దకు ధైర్యంగా రావాలని, సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. పోలీసు అధికారుల బదిలీల్లో తన ప్రమేయం లేదని, ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే జరిగాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు