అప్పుల్లో దేశంలోనే నంబర్‌-1 గా ఏపీ

రాష్ట్రప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చి వాటిని చెప్పిన పనులకు వినియోగించకుండా తన రెవెన్యూ ఖర్చులకు ఉపయోగిస్తోందని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

Published : 29 Nov 2023 05:53 IST

తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చి వాటిని చెప్పిన పనులకు వినియోగించకుండా తన రెవెన్యూ ఖర్చులకు ఉపయోగిస్తోందని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అప్పుల్లో, ప్రభుత్వ గ్యారెంటీల్లో దేశంలోనే నంబర్‌ వన్‌గా ఆంధ్రప్రదేశ్‌ ఉందన్నారు. 2018-2019 నాటికి ప్రభుత్వ గ్యారెంటీలు రూ.50 వేల కోట్లు ఉంటే గతేడాది చివరకు రూ. 1.5 లక్షల కోట్లు దాటాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, అప్పులు ఇచ్చిన బ్యాంకులు, కాగ్‌ వంటి సంస్థలు వీటిని నియంత్రించాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అప్పుల భారం పెరిగిందని, దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతూ నేను రాసిన లేఖలకు ఆర్థికమంత్రి, కార్యదర్శుల నుంచి జవాబు రాకపోవడంతో మా ఆందోళన సరైనదని భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ గ్యారెంటీలు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం నిషిద్ధం. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించి తమకు నచ్చిన కాంట్రాక్టు సంస్థలకు బ్యాంకు గ్యారెంటీలు ఇస్తుంది. ఇది రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తుంది’ అని రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని