మంత్రి బొత్స ఇలాకాలోని జాబితాలో మృతుల పేర్లు

మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మృతి చెందిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని తెదేపా, జనసేన నాయకులు ఆరోపించారు.

Published : 29 Nov 2023 05:58 IST

తొలగించాలని ఆర్డీవోకు తెదేపా, జనసేన విజ్ఞప్తి

చీపురుపల్లి, న్యూస్‌టుడే: మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మృతి చెందిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని తెదేపా, జనసేన నాయకులు ఆరోపించారు. వాటిని తొలగించాలని కోరుతూ ఆర్డీవో బి.శాంతికి మంగళవారం వారు వినతిపత్రం అందజేశారు. మృతుల పేర్లను జాబితాల నుంచి తొలగించాలని బీఎల్వోలకు విన్నవించినా వినడం లేదని గరివిడి, మెరకముడిదాం మాజీ ఎంపీపీలు పైల బలరాం, తాడ్డి సన్యాసినాయుడు, గరివిడి మండల అధ్యక్షుడు సారేపాక సురేష్‌కుమార్‌, జనసేన చీపురుపల్లి మండల అధ్యక్షుడు విసినిగిరి శ్రీనివాసరావు తదితరులు అన్నారు. మెరకముడిదాం మండలంలో బూత్‌ నంబరు 8లో 33 ఓట్లు, 9-57, 43-20, 38-19, గరివిడి మండలంలోని 103లో 37 ఓట్లు, 104-34, 106-25, 107-27, 108-37, 110-26, 114-31, 115లో 44 ఓట్లు ఉన్నాయన్నారు. చీపురుపల్లిలో 150వ నంబరు కేంద్రంలో 72 ఓట్లు, 141-32, 142-36, 149-52, 151-39, 152లో 22 ఓట్లు ఉన్నాయన్నారు. వాటిని పరిశీలించి తొలగించాలని ఆర్డీవోను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని