ఓటర్ల జాబితాలో అక్రమాలపై విచారణ చేపట్టండి

జిల్లాలోని ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావును తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు.

Updated : 29 Nov 2023 06:39 IST

పరిశీలకుడికి తెదేపా నాయకుల ఫిర్యాదు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: జిల్లాలోని ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావును తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఓటర్ల జాబితాలోని లోపాలు, అక్రమాలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత జాబితాలో చనిపోయినవారి పేర్లు, డబుల్‌ ఎంట్రీలు, ఇతర నియోజకవర్గాలు, రాష్ట్రాల ఓటర్ల వివరాలు సైతం పొందుపరిచారని తెలిపారు. ఈ విషయమై ఆధారాలతో ఇప్పటికే పలుమార్లు బీఎల్‌వోలు, కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినప్పటికీ సరి చేయలేదన్నారు.

జిల్లాలో ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా బీఎల్‌వోలు, ఏబీఎల్‌వోలతో శాసన సభాపతి తమ్మినేని సీతారాంతో పాటు మంత్రులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్మే బెందాళం అశోక్‌, మాజీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, బగ్గు రమణమూర్తి, గుండ లక్ష్మీదేవి, భాజపా నాయకుడు చల్లా వెంకటేశ్వరరావు, తదితరులు వారి నియోజకవర్గాల్లోని ఓటరు జాబితాల్లో నెలకొన్న లోపాలను వివరించారు. అనంతరం జె.శ్యామలరావు మాట్లాడుతూ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సమావేశంలో జేసీ ఎం.నవీన్‌, శిక్షణ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు బి.రామ్మోహన్‌రావు, రౌతు శంకరరావు, డి.గోవిందరావు, జి.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని