132 ఓట్ల తొలగింపునకు ఒకే వ్యక్తి దరఖాస్తు

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులోని మూడు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఒకే వ్యక్తి 132 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

Published : 29 Nov 2023 06:01 IST

వైకాపా కుట్రలో భాగమేనని తెదేపా ఆరోపణ

అచ్చంపేట, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులోని మూడు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఒకే వ్యక్తి 132 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తి అన్ని దరఖాస్తులు ఎలా చేస్తారని, ఇదంతా వైకాపా కుట్రలో భాగమేనని మండల తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై నియోజకవర్గ ఈఆర్వో నాగజ్యోతి, తహసీల్దార్‌ పద్మాదేవిలకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. వేల్పూరులో 132 మంది తెదేపా సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు పొన్నెకంటి రామారావు అనే వ్యక్తి ఫారం-7 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దాఖలు చేశారన్నారు. సదరు వ్యక్తి పేర్కొన్న ఓటర్లలో కొందరు గ్రామంలోనే ఉన్నారని, మరికొందరు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లారని తెదేపా నాయకులు పేర్కొన్నారు. దరఖాస్తులపై బీఎల్వోలు విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు నందిగం ఆశీర్వాదం, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని