‘మాకెందుకు జగన్‌?’

‘ఆంధ్రప్రదేశ్‌కి జగన్‌ ఎందుకు కావాలంటే..’, ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ పేరిట వైకాపా నేతలు, వాలంటీర్లు రాష్ట్రమంతా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. సీఎం మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో మాత్రం ‘మాకెందుకు జగన్‌?’ అంటున్నారు.

Published : 30 Nov 2023 05:29 IST

‘ఆంధ్రప్రదేశ్‌కి జగన్‌ ఎందుకు కావాలంటే..’, ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ పేరిట వైకాపా నేతలు, వాలంటీర్లు రాష్ట్రమంతా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. సీఎం మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో మాత్రం ‘మాకెందుకు జగన్‌?’ అంటున్నారు. పెండ్లిమర్రి మండలం రంపతాడు సచివాలయం పరిధిలోని శివాలయం వద్ద నిర్వహించిన రెండు కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శితోపాటు ఒకరిద్దరు వాలంటీర్లు, కొద్దిమంది డ్వాక్రా మహిళలు మాత్రమే పాల్గొన్నారు. నాలుగున్నరేళ్లుగా తమకు ఒరిగిందేమీ లేదంటూ పార్టీ నేతలు సమావేశాలను బహిష్కరించడంతో.. ఖాళీ కుర్చీల మధ్యే మమ అనిపించారు.

ఈనాడు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని