బడిలో ‘జగనే ఎందుకు కావాలి?’

తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని వేంబాకం ఉన్నత పాఠశాలలో ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమాన్ని నిర్వహించడం విమర్శలు తావిచ్చింది.

Published : 30 Nov 2023 05:29 IST

నాగలాపురం, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని వేంబాకం ఉన్నత పాఠశాలలో ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమాన్ని నిర్వహించడం విమర్శలు తావిచ్చింది. ఎంపీడీవో కుళ్లాయిబాబు, వైకాపా మండల సమన్వయకర్త అపరంజిరాజు ఆధ్వర్యంలో బుధవారం తొమ్మిదో తరగతి విద్యార్థులను వేరే గదికి తరలించి మరీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మునిసుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. సచివాలయ సిబ్బంది అడగడంతో తరగతి గదిని ఖాళీ చేయించి వారికి అప్పగించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని