మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి బెయిల్‌

వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి కడప కేంద్ర కారాగారం నుంచి బుధవారం విడుదలయ్యారు.

Updated : 30 Nov 2023 04:45 IST

ఈనాడు, కడప: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి కడప కేంద్ర కారాగారం నుంచి బుధవారం విడుదలయ్యారు. 10 నెలల కిందట పట్టణ విమానాశ్రయం వద్ద పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారన్న అభియోగంపై ఈ నెల 14న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం కోర్టు రిమాండు విధించడంతో కడప కేంద్ర కారాగారానికి తరలించారు. తాజాగా రూ.25 వేల పూచీకత్తుపై జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం వల్లూరు పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పులివెందుల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్‌ రవి పులివెందులకు పయనమయ్యారు. అన్ని విషయాలూ గురువారం వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని