1న జనసేన విస్తృతస్థాయి సమావేశం

జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని డిసెంబరు 1న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు.

Updated : 30 Nov 2023 04:46 IST

ఈనాడు, అమరావతి: జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని డిసెంబరు 1న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు తదితర నేతలు పాల్గొంటారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల, నగర పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు, వీరమహిళ విభాగం ప్రతినిధులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు హాజరవుతారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలో పార్టీ శ్రేణులకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తారు. భవిష్యత్తు కార్యక్రమాల రూపకల్పన, ఓటర్ల జాబితా పరిశీలన తదితర అంశాలు చర్చకు రానున్నాయి. తెదేపాతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో జనసేన నిర్వహించాల్సిన కార్యక్రమాలపైనా చర్చించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు