రాజీనామా చేసిన వాలంటీర్లు తెదేపాలో చేరిక

ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సంజీవరాయునిపేట పరిధిలో పనిచేస్తూ రాజీనామా చేసిన వాలంటీర్లు వి.ఉదయకిరణ్‌, కె.రాధిక, ఎస్‌.లీలావతి, ఎం.వెంకటేశ్వర్లు, కె.సుమతి బుధవారం తెదేపాలో చేరారు.

Updated : 30 Nov 2023 04:46 IST

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సంజీవరాయునిపేట పరిధిలో పనిచేస్తూ రాజీనామా చేసిన వాలంటీర్లు వి.ఉదయకిరణ్‌, కె.రాధిక, ఎస్‌.లీలావతి, ఎం.వెంకటేశ్వర్లు, కె.సుమతి బుధవారం తెదేపాలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆ అయిదుగురూ మాట్లాడుతూ.. వైకాపా పాలనలో పార్టీ నాయకుల పెత్తనం ఎక్కువైందన్నారు. కార్యాలయానికి వచ్చిన వారికి కుర్చీలు వేయడం లేదన్న కారణంతో తమను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేయాలని ఒత్తిడి చేశారని, ఆ వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని