విశాఖ నుంచే మరోసారి ఎంపీగా పోటీ

వచ్చే ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ అన్నారు.

Updated : 30 Nov 2023 04:47 IST

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ

విశాఖపట్నం (డాబాగార్డెన్స్‌), న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం విశాఖలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ రాజకీయపార్టీ తరఫున పోటీ చేయాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. తన భావాలకు దగ్గరగా ఉండే పార్టీ నుంచే బరిలోకి దిగుతానన్నారు. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానన్నారు. ఆహ్వానించే పార్టీ తనకు నచ్చకపోతే సొంతంగా పార్టీ ప్రారంభిస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో బోగస్‌ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందని నిజమైన ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్‌ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు