సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసి తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తేల్చిచెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.

Published : 30 Nov 2023 05:20 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టీకరణ

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసి తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తేల్చిచెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం కోల్‌కతాలో ప్రారంభించిన సందర్భంగా అమిత్‌ షా ఓ బహిరంగ సభలో మాట్లాడారు. బుజ్జగింపు రాజకీయాలు, సరిహద్దు చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింస వంటి జాడ్యాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. సీఏఏను ఆమె వ్యతిరేకిస్తున్నారని, కానీ అది అమలు కాకుండా ఎవ్వరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు ఎక్కువ సీట్లు ఇచ్చి.. బెంగాల్‌ వల్లే నేను ప్రధాని అయ్యాను అని చెప్పేందుకు మోదీకి అవకాశం ఇవ్వాలి’ అని ఓటర్లకు అమిత్‌ షా పిలుపునిచ్చారు.

నేర న్యాయ బిల్లులపై అందరినీ సంప్రదించండి: మమత

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన నేర న్యాయ బిల్లుల అమల్లో తొందరపాటు వద్దని మమతా బెనర్జీ సూచించారు. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరిపి.. ఒక అంగీకారానికి వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. దేశ ప్రజలను వివిధ కోణాల్లో ప్రభావితం చేసే ఈ చట్టాల ఆమోదం, అమలులో జాగరూకత అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అమిత్‌ షాకు మమత లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని