రోడ్లను బురద గుంతల్లా మార్చినందుకు మళ్లీ జగన్‌ కావాలా?

రాష్ట్రంలోని రహదారుల్ని బురద గుంతల్లా మార్చినందుకు సీఎం జగన్‌ మళ్లీ కావాలా అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

Published : 01 Dec 2023 05:13 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఎద్దేవా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని రహదారుల్ని బురద గుంతల్లా మార్చినందుకు సీఎం జగన్‌ మళ్లీ కావాలా అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. జగనే ఎందుకు వద్దంటే.. ఇదిగో ఈ దరిద్రానికి అంటూ గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల మండలం వేంపాడులో అధ్వానంగా మారిన గ్రామ ప్రధాన రహదారి వీడియోను గురువారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. జగన్‌ ఎందుకు కావాలి.. ఎందుకు రావాలి.. అని జనం ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ‘గుంతల రాజ్యం ఏపీ’ హ్యాష్‌ ట్యాగ్‌ను దానికి జత చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు