విశాఖను ఫైనాన్షియల్‌ హబ్‌గా ప్రకటించాలి: ధర్మాన

విశాఖను ఫైనాన్షియల్‌ హబ్‌గా ప్రకటించాలని, దీనికి అవసరమైన చర్యలను చేపట్టాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని కోరారు.

Published : 01 Dec 2023 05:14 IST

ఈనాడు, అమరావతి: విశాఖను ఫైనాన్షియల్‌ హబ్‌గా ప్రకటించాలని, దీనికి అవసరమైన చర్యలను చేపట్టాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు గురువారం లేఖ రాశారు ‘‘వివిధ ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రైవేటు కంపెనీలు విశాఖ కేంద్రంగా ఉన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం, షెడ్యూల్‌ బ్యాంకులు, లీడ్‌ బ్యాంకుల జోనల్‌ కార్యాలయాలు, వివిధ ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలు, కేపీఎంజీ, సీబీఆర్‌ఈ వంటి ఆర్థిక సేవలు అందించే సంస్థలు, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయాల ఏర్పాటుకు వీలుగా 100 ఎకరాల భూమిని ఫైనాన్షియల్‌ హబ్‌ కోసం కేటాయించాలి. విశాఖలో ఆర్బీఐ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి. విశాఖలో రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని కోరాలి. సీఎం అధ్యక్షతన కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ అథారిటీ ఏర్పాటు చేసి.. వివిధ కంపెనీల నుంచి ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులు జమయ్యేలా చూడాలి’’ అని సీఎంకు రాసిన లేఖలో ధర్మాన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు