10 నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు!

తెదేపా అధినేత చంద్రబాబు త్వరలో పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Published : 02 Dec 2023 03:35 IST

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు త్వరలో పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారు. ఈ నెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. ఓటర్ల జాబితాలో వైకాపా నాయకులు చేస్తున్న అక్రమాలపై దిల్లీ వెళ్లి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం సమయం ఇవ్వాలని సీఈసీకి చంద్రబాబు లేఖ రాయనున్నట్టు సమాచారం.

దర్గా, మేరీమాత ఆలయాల సందర్శన

చంద్రబాబు శనివారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు. ఆదివారం సింహాచలం అప్పన్నను, ఈ నెల 5న శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటారు. అనంతరం కడపలోని అమీన్‌పీర్‌ దర్గా, విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయాల్ని సందర్శిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని