జల వివాదం కేసీఆర్‌, జగన్‌ల ఎత్తుగడ: కోదండరాం

ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఓటు హక్కు ద్వారా ప్రజలు తిరుగుబాటు చేశారని, ఆ మేరకు ఎన్నికల ఫలితాలు రానున్నాయని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు.

Updated : 02 Dec 2023 06:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఓటు హక్కు ద్వారా ప్రజలు తిరుగుబాటు చేశారని, ఆ మేరకు ఎన్నికల ఫలితాలు రానున్నాయని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయం తరువాత ప్రజల ఐక్యతను ఇప్పుడే అలా చూస్తున్నానని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ అనుసరించిన విధానాలకు ప్రతిఫలంగా ప్రజలు ఇస్తున్న తీర్పు ఇదని ఆయన వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కలిసి కృష్ణా జలాల వివాదాన్ని తెరపైకి తెచ్చారు. కానీ, వారి ఎత్తుగడ భగ్నం అయింది’ అని అన్నారు. న్యాయసమ్మతంగా ఏపీ.. నీటి వాటాను పొందడానికి వీలున్నప్పటికీ ఆ ప్రభుత్వం  ఇష్టానుసారంగా వ్యవహరించిందని అన్నారు. వివాదంపై బోర్డుకు, కేంద్రానికి కూడా లేఖలు రాస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని