‘యువగళం’.. వైకాపా పతనానికి నాంది

తెదేపా అధినేత చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అవలంబించిన వైఖరే ఆ రాష్ట్రంలో భారాస పార్టీ గడ్డు పరిస్థితికి కారణమని జై భారత్‌ నేషనల్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు జి.చిన్నయ్య దొర విమర్శించారు.

Published : 02 Dec 2023 03:37 IST

జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు చిన్నయ్య దొర

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అవలంబించిన వైఖరే ఆ రాష్ట్రంలో భారాస పార్టీ గడ్డు పరిస్థితికి కారణమని జై భారత్‌ నేషనల్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు జి.చిన్నయ్య దొర విమర్శించారు. ఇదే పరిస్థితి ఏపీలోని వైకాపాకూ ఎదురవుతుందన్నారు. తెదేపా యువ నేత లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం పాదయాత్ర’ వైకాపా పతనానికి నాంది అని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో చిన్నయ్య దొర మాట్లాడారు. ‘ప్రస్తుత ఎన్నికల్లో భారాస ఓడిపోతే అందుకు కేసీఆర్‌ వైఖరి, అప్రజాస్వామ్య విధానాలే కారణం. చంద్రబాబు అరెస్టు విషయంలో కేసీఆర్‌ నోటిమాటగా కూడా స్పందించకపోగా.. ఆ అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్‌లో ఐటీ నిపుణులు నిరసన వ్యక్తం చేస్తే కేటీఆర్‌ బెదిరించడం అప్రజాస్వామికం. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గం’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని