స్వప్రయోజనాలకే కృష్ణా జలాల తాకట్టు

తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి, బాబాయ్‌ హత్య కేసు నుంచి అవినాష్‌రెడ్డిని కాపాడటానికి.. కృష్ణా జలాల్ని పక్క రాష్ట్రానికి సీఎం జగన్‌ ధారాదత్తం చేశారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

Published : 02 Dec 2023 03:38 IST

తెదేపా నేత దేవినేని ఉమా మండిపాటు

ఈనాడు, అమరావతి: తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి, బాబాయ్‌ హత్య కేసు నుంచి అవినాష్‌రెడ్డిని కాపాడటానికి.. కృష్ణా జలాల్ని పక్క రాష్ట్రానికి సీఎం జగన్‌ ధారాదత్తం చేశారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సాగునీటి నిర్వహణలో తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే సీఎం కొత్త నాటకాలకు తెర తీశారని దుయ్యబట్టారు. ‘కృష్ణా జలాలతో ఏ జిల్లాలో ఎంత ఆయకట్టు సాగులోకి వస్తుందో కూడా జగన్‌కు తెలియదు. గతంలో చంద్రబాబు.. కేఆర్‌ఎంబీతో వివాదాలు లేకుండా రాష్ట్రానికి రావాల్సిన వాటా సాధించారు. మా పాలనలో ఏ సంవత్సరం.. ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీరు ఇచ్చామనే వివరాల్ని ఆధారాలతో ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధం?’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని