కొప్పుల ఈశ్వర్‌పై ఎన్నికల పిటిషన్‌ కొట్టివేత

జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Updated : 02 Dec 2023 06:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. వీవీపాట్‌ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, ఆయన ఎన్నికను రద్దు కోరుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆదూర్‌ లక్ష్మణ్‌రావు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ శుక్రవారం తీర్పు వెల్లడించారు. లక్ష్మణ్‌రావు ఆరోపణలకు సంబంధించి పత్రసహిత ఆధారాలేవీ సమర్పించనందున దీంట్లో జోక్యం చేసుకోలేమన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్నికల సామగ్రిని స్ట్రాంగ్‌ రూంలో ఉంచి భద్రపరచడంలో విధానపరమైన లోపాలున్నాయని, అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. అనంతరం అధికారులను విచారించి, కొప్పుల ఈశ్వర్‌ ఎన్నికపై పిటిషనర్‌ ఆరోపణలకు ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు