తెదేపా నేత డూండీ రాకేష్‌ అరెస్టు.. విడుదల

తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌ను విజయవాడ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Published : 04 Dec 2023 04:05 IST

విజయవాడ(పటమట), న్యూస్‌టుడే: తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌ను విజయవాడ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆర్య వైశ్యులకు వైకాపా ఏం చేసిందో చెప్తానని, తెదేపా నాయకులు చర్చకు రావాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు గత నెల 26న సవాల్‌ విసిరారు. డూండీ రాకేష్‌ స్పందిస్తూ తెదేపా హయాంలో ఆర్యవైశ్యులకు జరిగిన లబ్ధిపై చర్చించేందుకు సిద్ధమని, డిసెంబరు 3న విజయవాడలోని కన్యకాపరమేశ్వరి ఆలయం వద్దకు రావాలని అన్నారు. ఈ నేపథ్యంలో రాకేష్‌ తన కారులో ఆదివారం రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వస్తుండగా.. ఉదయం ప్రసాదంపాడు వద్ద పోలీసులు ఆయన్ని అడ్డుకొని.. గుణదల పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆర్యవైశ్య సంఘాలు స్టేషన్‌ ముందు ఆందోళన చేశాయి. సాయంత్రం 6.30 గంటలకు రాకేష్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాకేష్‌ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు చేసిందేమీ లేకపోవడంతో పోలీసులను అడ్డం పెట్టుకొని వెలంపల్లి తనను అరెస్టు చేయించారని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని