వ్యక్తిగత భద్రతపై పోలీసులు స్పష్టత ఇవ్వాలి

తన వ్యక్తిగత భద్రతపై జిల్లా పోలీసు యంత్రాంగం స్పష్టతనివ్వాలని మాజీ ఎమ్మెల్సీ, వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జ్‌ బీటెక్‌ రవి పోలీసులను ప్రశ్నించారు.

Published : 04 Dec 2023 04:10 IST

మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆందోళన

వల్లూరు, న్యూస్‌టుడే: తన వ్యక్తిగత భద్రతపై జిల్లా పోలీసు యంత్రాంగం స్పష్టతనివ్వాలని మాజీ ఎమ్మెల్సీ, వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జ్‌ బీటెక్‌ రవి పోలీసులను ప్రశ్నించారు. గత నెల 14న అరెస్టయిన కేసుకు సంబంధించి ప్రతి ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాలన్న నిబంధన మేరకు ఆయన వల్లూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో తనకు వ్యక్తిగత భద్రత ఉండేదని, బెయిల్‌పై బయటకొచ్చినప్పటి నుంచి అది లేదన్నారు. ప్రస్తుతం భద్రతను తొలగించారా లేదా కొనసాగిస్తారా అనే విషయమై స్పష్టత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ భద్రతను తొలగించి ఉంటే పునరుద్ధరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని