రాష్ట్రానికి జగన్‌ వద్దనడానికి సవాలక్ష కారణాలున్నాయి: కన్నా లక్ష్మీనారాయణ

‘‘ఒక్క అవకాశం’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ ఇప్పుడు కొత్తగా ‘ఏపీ నీడ్స్‌ జగన్‌’ అంటూ ప్రజల్లోకి రావడం సిగ్గుచేటు.

Published : 04 Dec 2023 04:11 IST

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: ‘‘ఒక్క అవకాశం’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ ఇప్పుడు కొత్తగా ‘ఏపీ నీడ్స్‌ జగన్‌’ అంటూ ప్రజల్లోకి రావడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రానికి జగన్‌ వద్దు అనడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి’’ అని మాజీ మంత్రి, తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరులోని నివాసంలో ఆదివారం ‘ఏపీ హేట్్స జగన్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. ‘ఏపీకి జగన్‌ ఎందుకు వద్దో కారణాలతో బుక్‌లెట్ ముద్రించాం. రాజధాని అమరావతిని నాశనం చేసి విశాఖను నిలువునా దోచుకున్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని నిరుద్యోగులను మోసం చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రజల్ని దగా చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పోలవరాన్ని నాశనం చేశారు. అందుకే మీరు మాకొద్దు అంటున్నారు ప్రజలు. రాష్ట్రంలో దోచుకోవడానికి ఇక ఏమీ లేవు. గత ఎన్నికల్లో కేసీఆర్‌ డబ్బు ఇచ్చారని ఏపీ ప్రజల పొట్ట కొట్టారు’ అని కన్నా ధ్వజమెత్తారు. సమావేశంలో తెదేపా నాయకులు తాళ్ల వెంకటేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని