ఆంధ్రాపై తెలంగాణ ఫలితాల ప్రభావం

తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవడం.. ఆంధ్రాపై తప్పక ప్రభావం చూపుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు.

Published : 04 Dec 2023 04:12 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవడం.. ఆంధ్రాపై తప్పక ప్రభావం చూపుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణలో సీపీఐ-కాంగ్రెస్‌లు కలిసి, యువతకు ప్రాధాన్యం ఇచ్చాయి. భారాసకు అహంభావం ఎక్కువై ఓటమి చవిచూసింది. రాజకీయాల్లో ప్రజలు అహంభావాన్ని సహించరు. కేసీఆర్‌ను గెలిపించేందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా శ్రమించారు. చివరికి నాగార్జునసాగర్‌ వద్దకు పోలీసులను పంపి, సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు యత్నించారు. తెలంగాణలో ఓడిపోయింది కేసీఆర్‌ అయినా, శృంగభంగం జరిగింది జగన్‌మోహన్‌రెడ్డికే’’ అని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని