తెలంగాణలో విజయంపై ఏపీ కాంగ్రెస్‌ సంబరాలు

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల కృషితోనే ఆ రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.

Published : 04 Dec 2023 04:13 IST

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల కృషితోనే ఆ రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో సంబరాలు నిర్వహించారు. రుద్రరాజు మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంతో వచ్చిన స్ఫూర్తితో తెలంగాణ నాయకులు పని చేశారని కొనియాడారు. ప్రతిపక్షాల సహకారంతో రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రరత్నభవన్‌లో పెద్ద ఎల్‌ఈడీ తెర ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు. తెలంగాణలో మెజారిటీ రావడంతో గిడుగు రుద్రరాజు నేతృత్వంలో సంబరాలు మొదలుపెట్టారు. పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు మిఠాయిలు పంచారు. బాణసంచా కాల్చారు. సుంకర పద్మశ్రీ, జంగా గౌతం, కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్‌ వెళ్లిన రుద్రరాజు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసి, అభినందనలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని