‘గ్యారంటీ’లు అమలు చేయడంతోనే కాంగ్రెస్‌ విజయం

తెలంగాణలో కాంగ్రెస్‌ సాధించిన విజయంలో మా నేతల కృషి, ప్రభుత్వ గ్యారంటీ పథకాల ప్రభావం ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు.

Published : 04 Dec 2023 04:15 IST

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

ఈనాడు, బెంగళూరు: తెలంగాణలో కాంగ్రెస్‌ సాధించిన విజయంలో మా నేతల కృషి, ప్రభుత్వ గ్యారంటీ పథకాల ప్రభావం ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడారు. ‘తెలంగాణలో స్పష్టమైన మెజారిటీతో గెలిచాం. మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఓడినా.. దానికి కుంగిపోయే తత్వం కాంగ్రెస్‌కు లేదు. రాహుల్‌గాంధీ తెలంగాణలో చేపట్టిన పాదయాత్రతో అక్కడి కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని