భాజపాను ప్రజలు ఆశీర్వదించారు: పురందేశ్వరి

కేంద్రంలో భాజపా సుపరిపాలనను మెచ్చి మూడు రాష్ట్రాల్లో ప్రజలు పట్టం కట్టి ‘ఇండియా’ కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Published : 04 Dec 2023 04:17 IST

ఈనాడు, అమరావతి: కేంద్రంలో భాజపా సుపరిపాలనను మెచ్చి మూడు రాష్ట్రాల్లో ప్రజలు పట్టం కట్టి ‘ఇండియా’ కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఏపీలో వైకాపా ప్రభుత్వానికీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడుతారని జోస్యం చెప్పారు. ఆదివారం విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు విచక్షణతో ఆలోచించి భాజపాకు ఓటు వేయడంతో పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించిందన్నారు. తెలంగాణలోని కామారెడ్డిలో భాజపా అభ్యర్థి విజయం అసామాన్యమైందన్నారు. కార్యక్రమంలో భాజపా నేతలు బిట్ర శివన్నారాయణ, చిగురుపాటి కూమార స్వామి, షేక్‌ బాజీ, సాధినేని యామిని, పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని