దివ్యాంగుల పింఛన్ల మంజూరులో పక్షపాతం: పవన్‌కల్యాణ్‌

తమ పక్షం కాని దివ్యాంగులకు పింఛన్ల మంజూరు విషయంలో వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Updated : 04 Dec 2023 06:54 IST

ఈనాడు, అమరావతి: తమ పక్షం కాని దివ్యాంగులకు పింఛన్ల మంజూరు విషయంలో వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాబోయే తెదేపా-జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో దివ్యాంగులకు చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు. వారికి ధ్రువపత్రాల జారీని సరళీకరించటంతో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూస్తామని వివరించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.


విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం తెదేపాతోనే సాధ్యం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా ప్రభుత్వం వస్తేనే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. వారి ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల విభాగం గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు, అధ్యక్షుడు పూదోట సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


‘విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం’

ఈనాడు, అమరావతి: వైకాపా పాలనలో పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ‘నాడు-నేడు’ పేరిట ప్రచారం చేసుకుంటూ ఉపాధ్యాయులపట్ల కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు ఆదివారం తెనాలిలో మనోహర్‌ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలు జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లి, వీటిపై చర్చిస్తామని మనోహర్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని