పంట నష్టం లెక్కింపులో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: పవన్‌

ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతులు కుదేలవుతారని, పంట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

Published : 05 Dec 2023 02:33 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతులు కుదేలవుతారని, పంట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచించారు. ‘రాష్ట్రంపై మిగ్‌జాం తుపాను తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలి. తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయక చర్యల్లో జనసేన నాయకులు, శ్రేణులు పాల్గొనాలి’ అని పవన్‌ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు