తుపానుతో ‘యువగళం’ పాదయాత్రకు తాత్కాలిక విరామం

మిగ్‌జాం తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తాత్కాలిక విరామం ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంతమైన ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ప్రస్తుతం యాత్ర సాగుతున్న విషయం తెలిసిందే.

Published : 05 Dec 2023 05:02 IST

సహాయ చర్యల్లో తెదేపా శ్రేణులు పాల్గొనాలని లోకేశ్‌ పిలుపు

ఈనాడు, కాకినాడ-న్యూస్‌టుడే, కొత్తపల్లి: మిగ్‌జాం తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తాత్కాలిక విరామం ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంతమైన ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ప్రస్తుతం యాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 3 నాటికి 216 రోజులపాటు 2,974 కి.మీ. పాదయాత్ర సాగింది. శీలంవారిపాకల వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ఆదివారం రాత్రి లోకేశ్‌ బస చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యాత్రను మూడు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. యువగళం శిబిరం సముద్రం పక్కనే ఉండడంతో వాలంటీర్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోకేశ్‌ రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారు. తుపాను ప్రభావం తగ్గాక ఈ నెల 7న ఆగినచోట నుంచే యాత్రను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని