రైతుల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలి

మిగ్‌జాం తుపాను నేపథ్యంలో అన్నదాతల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.

Published : 05 Dec 2023 05:02 IST

తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మిగ్‌జాం తుపాను నేపథ్యంలో అన్నదాతల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. గతంలోనూ అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయినా, ప్రభుత్వం తగిన రీతిలో స్పందించలేదని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తుపాను బాధితులకు అండగా ఉండాలని తెదేపా కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. ‘పలు జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుంది. బాధితులకు చేతనైన సాయం చేయాలి. ఆహారం పంపిణీ, షెల్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పక్కా ప్రణాళికతో నష్టం వాటిల్లకుండా చూడాలి’ అని సూచించారు.

తుపాను కారణంగా చంద్రబాబు శ్రీశైలం పర్యటన రద్దయింది. షెడ్యూల్‌లో భాగంగా మంగళవారం ఆయన మల్లికార్జున స్వామిని దర్శించుకోవాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని