తెలంగాణ ఎన్నికల ఫలితాలతో వైకాపాలో వణుకు

తెలంగాణ ఎన్నికల ఫలితాలతో వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ తెలిపారు. ప్రజాక్షేత్రంలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి లాంటి వాళ్లు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Updated : 05 Dec 2023 04:47 IST

మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెలంగాణ ఎన్నికల ఫలితాలతో వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ తెలిపారు. ప్రజాక్షేత్రంలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి లాంటి వాళ్లు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో వారు దోచుకున్నదంతా నయా పైసలతో సహా కక్కిస్తామని ఓ ప్రకటనలో హెచ్చరించారు. ‘యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అధికార పక్షానికి రాజ్యాంగమన్నా, చట్టాలన్నా లెక్కలేదు. వారు ఎన్ని అడ్డదారులు తొక్కినా తెదేపా గెలుపును ఆపలేరు’ అని జవహర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని