చట్టాల్ని ఉల్లంఘిస్తున్న పోలీసులపై చర్యలెప్పుడు?

అత్యుత్సాహం ప్రదర్శించిన తెలంగాణ డీజీపీని ఈసీ సస్పెండ్‌ చేసినట్లు.. ఇక్కడ చట్టాల్ని ఉల్లంఘిస్తున్న పోలీసులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.

Updated : 05 Dec 2023 06:30 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అత్యుత్సాహం ప్రదర్శించిన తెలంగాణ డీజీపీని ఈసీ సస్పెండ్‌ చేసినట్లు.. ఇక్కడ చట్టాల్ని ఉల్లంఘిస్తున్న పోలీసులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘నిబంధనలు ఉల్లంఘించి.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసిన ఆ రాష్ట్ర డీజీపీని సస్పెండ్‌ చేశారు. మరి ఈ రాష్ట్రంలో చాలా మంది పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. వారిపై చర్యలెప్పుడు?’ అని సోమవారం ఆయన ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని