బల్క్‌గా ఫారం-7 దరఖాస్తుల స్వీకరణ ఆపాలి

పలు నియోజకవర్గాల్లో నిబంధనలకు విరుద్ధంగా బల్క్‌గా ఫారం-7లు స్వీకరిస్తున్నారని.. ఆ పోకడను వెంటనే నిలువరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాను తెదేపా నేతలు కోరారు.

Published : 06 Dec 2023 05:16 IST

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెదేపా వినతి

ఈనాడు, అమరావతి: పలు నియోజకవర్గాల్లో నిబంధనలకు విరుద్ధంగా బల్క్‌గా ఫారం-7లు స్వీకరిస్తున్నారని.. ఆ పోకడను వెంటనే నిలువరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాను తెదేపా నేతలు కోరారు. ఆధారాలు లేకపోయినా ఓట్లను తొలగిస్తున్నారని, ఓటర్లకు నోటీసులు ఇచ్చి గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయనకు వివరించారు. మండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌, మాజీ మంత్రి దేవినేని ఉమ, తెదేపా సీనియర్‌ నేత పిల్లి మాణిక్యరావు, తెదేపా ఎలక్టొరల్‌ సెల్‌ సమన్వయకర్త కోనేరు సురేష్‌.. సీఈఓను సచివాలయంలో మంగళవారం కలిసి వినతి అందజేశారు. అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఐఏఎస్‌ అధికారి మురళీధర్‌రెడ్డిని ఓటర్ల జాబితా పరిశీలకుడిగా నియమించడంపై తెదేపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని