వృత్తికి ద్రోహం చేసి న్యాయస్థానాల్లో స్టేలు తెచ్చుకోవడం సిగ్గుచేటు: బొండా ఉమా

వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కావాలంటూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) అక్టోబరు 23న జారీ చేసిన నోటీసులపై ఆయన ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు.

Published : 06 Dec 2023 05:16 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కావాలంటూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) అక్టోబరు 23న జారీ చేసిన నోటీసులపై ఆయన ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా ఉంటూ విజయసాయిరెడ్డి వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని, పార్లమెంటు సభ్యుడిగా ఆ హోదాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వృత్తికి ద్రోహం చేసి న్యాయస్థానాల్లో స్టేలు తెచ్చుకోవడం సిగ్గుచేటు’ అని బొండా విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని