తెలంగాణ తీర్పుతో జగన్‌కు కనువిప్పు కలగాలి

తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనైనా ఏపీ సీఎం జగన్‌కు కనువిప్పు కలగాలని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ హితవు పలికారు.

Updated : 06 Dec 2023 06:34 IST

లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ

విజయనగరం ఉడా కాలనీ, న్యూస్‌టుడే: తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనైనా ఏపీ సీఎం జగన్‌కు కనువిప్పు కలగాలని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ హితవు పలికారు. మంగళవారం ఆయన విజయనగరంలో మాట్లాడారు. ‘అవసరం ఉన్నా లేకపోయినా ఉచితాల పేరిట ఖజానాను ఖాళీ చేసేశారు. ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధినీ చూస్తారన్న విషయం తెలంగాణ ఎన్నికలతో నిరూపితమైంది. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలి. యువతకు ఉపాధి అవకాశాలు లేవు. పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు తగిన గుణపాఠం తప్పదు’అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని