ఒక్కో జిల్లాకు రూ.10 కోట్లు ఇవ్వాలి: సీపీఐ

మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల కోసం ఒక్కో జిల్లాకు కనీసం రూ.10 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు.

Published : 06 Dec 2023 05:19 IST

ఈనాడు, అమరావతి: మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల కోసం ఒక్కో జిల్లాకు కనీసం రూ.10 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు. ‘రాష్ట్రంలో 8 జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపింది. ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించి, ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. చాలాచోట్ల నూర్పిడి చేసి, కుప్పలుగా పోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. కోయని వరి నేలవాలింది.  ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కో జిల్లాకు కేటాయించిన రూ.2 కోట్లు ఏమాత్రం సరిపోవు. త్వరితగతిన పంట నష్టాన్ని అంచనా వేయించి, నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి, ఆదుకోవాలి. వరద బాధితులకు వసతి, ఆహారం, అవసరమైన మందులు తక్షణమే అందించాలి’’ అని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని