తుపానుతో నష్టపోయిన రాష్ట్రాలను కేంద్రం ఆదుకోవాలి

మిగ్‌జాం తుపానుతో నష్టపోయిన రాష్ట్రాలకు.. కేంద్రం పూర్తి సహాకారాన్ని అందించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు.

Published : 06 Dec 2023 05:19 IST

మల్లికార్జున ఖర్గే

దిల్లీ: మిగ్‌జాం తుపానుతో నష్టపోయిన రాష్ట్రాలకు.. కేంద్రం పూర్తి సహాకారాన్ని అందించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. తుపాను కారణంగా తమిళనాడులో కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ‘ఇలాంటి క్లిష్ట సమయంలో తుపాను బాధిత రాష్ట్రాలు కేంద్రం నుంచి అవసరమైన సహాయాన్ని అందుకోవాలి. అందరూ కలిసి కట్టుగా ఈ విపత్తును ఎదుర్కోవాలి’ అంటూ మంగళవారం ఆయన పిలుపునిచ్చారు. తుపాను కారణంగా తమిళనాడులో ప్రాణాలు కోల్పోయిన వారికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సంతాపం తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ కార్యకర్తలంతా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని