హామీలు గుర్తుచేస్తే.. పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు

ప్రశ్నిస్తే స్వపక్షమైనా వైకాపా చేతిలో బాధితులుగా మిగలాల్సిందే. సీఎం జగన్‌ సొంత జిల్లా వైయస్‌ఆర్‌లో ఖాజీపేట మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు చంద్రభాస్కర్‌రెడ్డిని.. వైకాపా నుంచి సస్పెండ్‌ చేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

Published : 06 Dec 2023 05:25 IST

వైయస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేట వైస్‌ ఎంపీపీ పదవికి రాజీనామా

ఈనాడు, కడప: ప్రశ్నిస్తే స్వపక్షమైనా వైకాపా చేతిలో బాధితులుగా మిగలాల్సిందే. సీఎం జగన్‌ సొంత జిల్లా వైయస్‌ఆర్‌లో ఖాజీపేట మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు చంద్రభాస్కర్‌రెడ్డిని.. వైకాపా నుంచి సస్పెండ్‌ చేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజోలి ఆనకట్ట నిర్మించి మైదుకూరు నియోజకవర్గానికి సాగునీరందించిన తర్వాతే ఓట్లడుగుతానంటూ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రజలకిచ్చిన హామీని.. చంద్రభాస్కర్‌రెడ్డి మంగళవారం జరిగిన మండల సమావేశంలో గుర్తు చేశారు. ఈ విషయం ఎమ్మెల్యేకు తీవ్ర ఆగ్రహం తెప్పించడంతో కడప పార్లమెంటరీ నియోజకవర్గ వైకాపా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ద్వారా మండల ఉపాధ్యక్షుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించారు. దీంతో చంద్రభాస్కర్‌రెడ్డి సైతం తన పదవికి రాజీనామా సమర్పించారు. రాజోలి ఆనకట్ట నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసి నాలుగేళ్లయిందని, కర్నూలు-కడప కెనాల్‌ ద్వారా కూడా సాగునీరివ్వలేకపోయామని రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో హామీలు గుర్తు చేయడం నేరమా? అంటూ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని