తుపాను సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలం

తుపాను తీవ్రతపై కేంద్ర సంస్థలు వారం నుంచే హెచ్చరికలు జారీ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షించకపోవడం దారుణమని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు.

Published : 06 Dec 2023 05:26 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపాటు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తుపాను తీవ్రతపై కేంద్ర సంస్థలు వారం నుంచే హెచ్చరికలు జారీ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షించకపోవడం దారుణమని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ‘తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయడంలో, సహాయ చర్యలు చేపట్టడంలోనూ వైకాపా సర్కారు విఫలమైంది. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. తుపాను నష్టం తీవ్రంగా ఉంది’ అని మంగళవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. తెదేపా శ్రేణులు మానవతా దృక్పథంతో స్పందించి బాధితులకు ఆహారం, ఇతర సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

బాధితులకు సాయం అందిస్తాం: నారా భువనేశ్వరి

తుపాను బాధితులకు సాధ్యమైనంత త్వరలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా సాయం అందజేస్తామని నారా భువనేశ్వరి ప్రకటించారు. ‘మిగ్‌జాం తుపాను నష్టం ఆవేదన కలిగిస్తోంది. చేతికొచ్చిన పంట నీటిపాలైన రైతన్నల బాధ వర్ణనాతీతం. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సాయం చేయడంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ముందుంటుంది. అవకాశం ఉన్న ప్రతిఒక్కరూ బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలి’ అని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని