సీఎం బయటికి రారేం?

మిగ్‌జాం తుపాను ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సీఎం జగన్‌ ఒక చిన్న సందేశమిచ్చి ఇంట్లో కూర్చోవడం చూస్తే రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకున్నట్లుగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.

Updated : 07 Dec 2023 05:37 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: మిగ్‌జాం తుపాను ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సీఎం జగన్‌ ఒక చిన్న సందేశమిచ్చి ఇంట్లో కూర్చోవడం చూస్తే రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకున్నట్లుగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. దిల్లీలో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. జగన్‌ ఇప్పటికైనా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులు తెలుసుకొని ఆదుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. సీఎం స్థాయి వ్యక్తి ఉపద్రవాలు వచ్చిన ప్రాంతంలోనే ఉంటే ఎంత సాధికారికంగా పనులు జరుగుతాయో విశాఖపట్నంలో తిత్లీ తుపాను వచ్చినప్పుడు చంద్రబాబు వ్యవహరించిన తీరుతో అంతా చూశారన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు పత్తా లేరన్నారు. ఎమ్మెల్యేలూ వారి బాటలోనే నడుస్తున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో తుపాను బాధితులను ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని