రైతాంగాన్ని ఆదుకోవాలి

తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్‌ చేశారు.

Updated : 07 Dec 2023 05:34 IST

పురందేశ్వరి డిమాండ్‌

ఈనాడు-అమరావతి: తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన జారీచేశారు. ‘ఆహార ధాన్యాలు, ఉద్యానవన పంటలతో సహా పలు వాణిజ్యపంటలను పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు రూ.40వేలు చొప్పున ఖర్చుపెట్టి..సాగుచేసిన పంట చేతికి అందే సమయంలో తీవ్రంగా నష్టపోవడం రైతులను కుంగదీస్తోంది. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. వరిపంట పూర్తిగా తడిసి ముద్దయింది. ప్రస్తుతం ఈ ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. నేలమట్టమైన పూరిళ్లను ప్రభుత్వం వెంటనే నిర్మించాలి’ అని పురందేశ్వరి డిమాండ్‌చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని