పోలిపల్లిలో యువగళం ముగింపు సభ!

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ నెల 17న నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

Updated : 07 Dec 2023 05:28 IST

చంద్రబాబు, పవన్‌ హాజరు?

భోగాపురం, న్యూస్‌టుడే: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ నెల 17న నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. తెదేపా నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో బుధవారం పోలిపల్లిలో ఓ లేఅవుట్‌లోని స్థలాన్ని ఆ పార్టీ నేతలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తదితరులు పరిశీలించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హాజరుకానున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని